కర్ణాటకకు చెందిన ఏడేళ్ల వయసున్న వైధృతి నాగరాజ్ కోరిషెట్టర్ అనే బాలిక.. బాల మేధావిగా అందరి మన్ననలు పొందుతోంది. ఆ చిన్నారి అద్భుత జ్ఞాపక శక్తికి మెచ్చిన మధురై విశ్వవిద్యాలయం డాక్టరేట్‌తో సత్కరించింది.
బల్లారి జిల్లా బొమ్మనహల్లికి చెందిన నాగరాజ్, భారతిల కుమార్తె వైధృతి. గడగ్ జిల్లా నారగుండలో రెండో తరగతి చదువుతోంది. రెండేళ్ల వయసులోనే వైధృతికి జనరల్ నాలెడ్జ్ ఒంటబట్టేసింది. ఎంతలా అంటే... జాతీయ, అంతర్జాతీయ రాజకీయాలు, ఆర్థికాంశాలు, చరిత్ర పుటలు, కవుల పేర్లు, నదులు, రాజులు, సామ్రాజ్యాలు.. అబ్బో ఒక్కటేమిటీ ఏది అడిగినా ఇట్టే సమాధానం చెప్పేసేంతగా రాటుదేలిపోయింది.