ఏ సాయం లేకుండా మీరు గోడలు ఎక్కగలరా? ఎప్పుడైనా కనీసం ప్రయత్నించారా? కానీ ఓ ఏడేళ్ల బాలుడు ఎలాంటి సహాయం లేకుండా గోడలపై పాకుతున్నాడు. ఉత్తర్ప్రదేశ్ కాన్పుర్కు చెందిన యశార్థ్ సింగ్ గౌర్ ఈ అద్భుత విన్యాసం చేస్తున్నాడు.
స్పైడర్ మ్యాన్ సినిమా చూసి.. ఆ హీరోలానే తాను గోడలు ఎక్కాలనుకున్నాడు యశార్థ్. అనంతరం సాధన చేసి అనుకున్నది చేస్తున్నాడు.
"స్పైడర్ మ్యాన్ సినిమా చూసి.. నేను అలాగే గోడలు ఎక్కాలనుకున్నాను. ఇంట్లోనే సాధన చేశాను. మొదట్లో పడిపోయేవాణ్ని. కానీ ఆ టెక్నిక్ తెలుసుకొని గోడలు ఎక్కడం మొదలుపెట్టాను. ఈ విషయం నా సోదరుడికి చెప్పాను. తర్వాత అందరికీ తెలిసింది. నేను పడిపోతానని ఎప్పుడూ భయపడను. ఒకవేళ జారిపోతే అక్కడి నుంచి దూకెస్తాను."