కర్ణాటక సాంస్కృతిక నగరం మైసూర్లో ప్రపంచ అద్భుతాలన్నీ ఒకే చోట కనువిందు చేస్తున్నాయి. క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా కేకుతోనే ప్రపంచంలోని ఏడు వింతలను తయారు చేశారు డాల్ఫిన్ బేకర్స్.
సృజనాత్మకత జోడించి ప్రపంచ వింతలతో అందంగా తయారు చేసిన కేకులు.. అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. తాజ్‌మహల్, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, జోర్డాన్‌లోని పెట్రా, ఈజిప్టులోని చించెన్ ఇట్జా పిరమిడ్, పెరూలోని మాచుపిచ్చూ, బ్రెజిల్‌లోని క్రీస్ట్ ద రిడీమర్, ఇటలీలోని కొలొజియం అన్నింటినీ ఒకే చోట కేకులతో సృష్టించేశారు.