తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉన్నావ్ ఘటనలో ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్​ వేటు - ఉన్నవ్ కేసులో పోలీసులపై వేటు

ఉన్నావ్​లో అత్యాచార బాధితురాలి మృతి నేపథ్యంలో ఏడుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేసింది ఉత్తర్​ ప్రదేశ్​ ప్రభుత్వం. ఆమెకు రక్షణ కల్పించకుండాా విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంటూ ఈ నిర్ణయం తీసుకుంది.

UNNAO
ఉన్నావ్​

By

Published : Dec 9, 2019, 5:46 AM IST

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో.. ఘటనపై ఉత్తర్​ప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా ఉన్నావ్ ఎస్​హెచ్​ఓతో పాటు మరో ఆరుగురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేసింది.

అసలేమైందంటే..

ఉన్నావ్​ అత్యాచార బాధితురాలు విచారణ కోసం కోర్టుకు వెళ్తున్న సమయంలో నిందితులు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించారు. 90 శాతం కాలిన గాయాలతో దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలు.. శుక్రవారం రాత్రి కన్నుమూసింది.

ఈ నేపథ్యంలో ఆమెకు భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహించారని పేర్కొంటూ ఏడుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్​ ప్రదేశ్​ ప్రభుత్వం వెల్లడించింది.

ఇదీ చూడండి:అశ్రునయనాల మధ్య 'ఉన్నావ్​' బాధితురాలికి వీడ్కోలు

ABOUT THE AUTHOR

...view details