తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేపర్​ మిల్లులో గ్యాస్​ లీక్​.. ముగ్గురి పరిస్థితి విషమం - paper-mill

7 people affected in gas leak from paper mill in raigarh
పేపర్​ మిల్లులో గ్యాస్​ లీక్​.. ముగ్గురి పరిస్థితి విషమం

By

Published : May 7, 2020, 3:03 PM IST

Updated : May 7, 2020, 3:55 PM IST

15:52 May 07

విశాఖ గ్యాస్ లీక్​ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా ఛత్తీస్​గఢ్​లోనూ ఇదే తరహా ఘటన జరిగింది. రాయ్​గఢ్​ జిల్లా తెత్లా ప్రాంతంలోని ఓ పేపర్​ మిల్లులో విషవాయువు కారణంగా ఏడుగురు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. నిరుపయోగంగా పడి ఉన్న ఓ ట్యాంక్​ను శుభ్రం చేసేందుకు వెళ్లడమే ఘటనకు కారణంగా తెలుస్తోంది. చాలా కాలం నుంచి ఉపయోగించని కారణంగా అక్కడ విషవాయువులు తయారయ్యాయని సమాచారం.

రాయ్​గఢ్ ఎస్పీ సంతోష్ సింగ్, కలెక్టర్ యశ్వంత్ కుమార్ బాధితులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని సందర్శించారు. మిల్లు యజమాని.. ఘటనను అధికారుల దృష్టికి రాకుండా చర్యలు తీసుకున్నాడని, యాజమాన్యంపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. 

14:56 May 07

ఛత్తీస్​గఢ్​లో గ్యాస్​ లీక్​.. ముగ్గురి పరిస్థితి విషమం

ఛత్తీస్​గఢ్ తెత్లా ప్రాంతంలోని ఓ పేపర్​ మిల్లులో గ్యాస్​ లీకైంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ ట్యాంక్​ క్లీనింగ్​ చేస్తుండగా.. విషవాయువు వెలువడినట్లు తెలుస్తోంది. 

Last Updated : May 7, 2020, 3:55 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details