తెలంగాణ

telangana

ETV Bharat / bharat

7 పెళ్లిళ్లు.. 20 మందిపై అత్యాచారం! - అత్యాచార0

ఏడుగురు యువతులను పెళ్లిచేసుకొని మోసం చేయడమే కాక... 20 మంది మహిళల్ని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడో నకిలీ ఎస్సై. రాజే​శ్​ పృథ్వీ అనే వ్యక్తి పలు అవతారాలెత్తి ఎందరినో మోసగించిన కేసులో చెన్నై పోలీసులు అతడ్ని అరెస్టు చేశారు.

7 పెళ్లిళ్లు.. 20 మందిపై అత్యాచారం!

By

Published : Sep 17, 2019, 10:51 AM IST

Updated : Sep 30, 2019, 10:31 PM IST

ఏడుగురు యువతులను పెళ్లిచేసుకుని మోసం చేయడంతోపాటు 20 మంది మహిళలను బెదిరించి అత్యాచారానికి పాల్పడిన నకిలీ ఎస్సైని అరెస్టు చేసినట్లు చెన్నై పోలీసులు తెలిపారు. చెన్నై ఎగ్మూరుకు చెందిన యువతి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ 30న ఆఫీసు నుంచి ఆమె ఇంటికి వెళ్లలేదు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. ఈలోపు యువతి తల్లిదండ్రులు మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు.

యువతి పనిచేస్తున్న కంపెనీ ఎండీ రాజేశ్​ పృథ్వీ (29) ఆమెను అపహరించి పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అతడి సొంత ఊరైన తిరుప్పూరు జిల్లా నొచ్చిపాళైయం వెళ్లిన పోలీసులు.. అక్కడ బందీగా ఉన్న యువతిని రక్షించారు. తర్వాత ఆమెతో మాట్లాడించి పృథ్వీని ఇంటికి పిలిపించిన పోలీసులు.. అతడిని అరెస్టుచేసి విచారణ జరిపారు. రాజేశ్​ పృథ్వీ ఏడోతరగతి మాత్రమే చదివాడని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

కొత్త కొత్త అవతారాలు..

పలుపేర్లతో పెద్ద చదువులు చదివినట్లు నమ్మించి అనేకమంది మహిళలను మోసగించి అత్యాచారం చేసినట్లు తేలిందన్నారు. ఇప్పటికే ఆరుగురు యువతులను పెళ్లి చేసుకున్నాడన్నారు. అతడిపై తమిళనాడులోని తిరుచ్చి, కోయంబత్తూరు, తిరుప్పూరు, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి, శ్రీకాళహస్తి పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తిరుపతిలో నమోదైన ఓ కేసులో జైలుశిక్ష పడింది. శ్రీకాళహస్తి పోలీసులు కోయంబత్తూరులో అరెస్టు చేసినప్పుడు కస్టడీ నుంచి పారిపోయాడు.

నకిలీ ఎస్సై.. రాజీనామా...

ఏడోపెళ్లి చేసుకోవడానికి ఎస్సై అవతారమెత్తాడు. ఎస్సై ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెప్పి అమైందకరైలో నకిలీ కాల్​సెంటర్​ ప్రారంభించాడు. ఇక్కడ 20 మంది మహిళలను బెదిరించి అత్యాచారం చేశాడు. చివరిగా ఎగ్మూరు యువతిని అపహరించి ఏడో పెళ్లి చేసుకున్నాడు. వైద్య కళాశాలలో సీటు ఇప్పిస్తానని రూ.30 లక్షల మేరకు మోసం చేశాడు. అమైందకరై పోలీసుస్టేషన్ లో ఇతడిపై 15 మంది ఫిర్యాదుచేశారు.

ఇదీ చూడండి:జమ్ముకశ్మీర్​లో 'మోదీ బర్త్​డే' సంబరాలు

Last Updated : Sep 30, 2019, 10:31 PM IST

ABOUT THE AUTHOR

...view details