ఉత్తర్ప్రదేశ్ బిస్వాలో దారుణం జరిగింది. ప్రముఖ కార్పెట్ పరిశ్రమలో గ్యాస్ లీకేజీ కారణంగా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది.
ఈ రోజు ఉదయం జలాల్పుర్లోని దరీ ఫ్యాక్టరీకి చేరుకున్న కార్మికులు.. గ్యాస్ లీకైనట్లు గమనించారు. పరిశ్రమ పరిసర ప్రాంతంలో ఏడు మృతదేహాలను చూసి కంగుతిన్నారు. కుటుంబంతో సహా ఫ్యాక్టరీ సమీపాన గుడారాల్లో నివసిస్తున్న కూలీలు.. విష వాయువు పీల్చడం వల్ల నిర్జీవులయ్యారు.
ట్యాంకర్ వల్లేనా?
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ కార్పెట్ కర్మాగారానికి పక్కనే యాసిడ్ ఫ్యాక్టరీకి చెందిన ట్యాంకర్ కడుగుతారు. బహుశా, దాని నుంచి గ్యాస్ లీక్ అయి ఉంటుందని అనుమానిస్తున్నారు.