ఒడిశాలో మూడు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తాయి. వరద బీభత్సానికి ఇప్పటివరకు ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గల్లంతయ్యారు.
మృతి చెందిన వారిలో నలుగురు మయూర్ భంజ్ వాసులు కాగా.. ఇద్దరు కియోంగఢ్, మరొకరు సుందర్‌గఢ్ ప్రాంతాలకు చెందినవారు.
విరిగిపడిన కొండచరియలు..
భారీ వర్షాల కారణంగా ఉత్తరాఖండ్‌లోని లంబాగర్, భన్నేర్పాణీ ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడ్డాయి. ఫలితంగా బద్రీనాథ్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. సహాయక సిబ్బంది చర్యలు చేపట్టారు.