ఉత్తరఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తెహ్రీ గర్వాల్ జిల్లా నైన్భాగ్లోని ఓ వంతెన సమీపంలో కారు బోల్తాపడి ఏడుగురు మృతి చెందారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్టు పోలీసులు తెలిపారు.
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి - రోడ్డు ప్రమాదం
ఉత్తరాఖండ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. తెహ్రీ గర్వాల్ జిల్లా నైన్‌భాగ్ వద్ద ఈ ఘటన జరిగింది.
ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు మృతి
ప్రమాదం జరిగిన వెంటనే ఐదుగురు చనిపోగా.. తాజాగా మరో ఇద్దరు మరణించారు. మృతుల పూర్తి వివరాల కోసం పోలీసులు విచారిస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదానికి.. అతివేగమే కారణమై ఉంటుందని భావిస్తున్నారు.
ఇదీ చూడండి : ప్రవాస భారతీయ దంపతులకు 'నోబెల్'