ఘోర రోడ్డుప్రమాదం- 9 మంది మృతి - ఉత్తర్ప్రదేశ్ రోడ్డు ప్రమాదం
06:41 October 17
ఘోర రోడ్డుప్రమాదం-ఏడుగురు మృతి
ఉత్తర్ప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. పురాన్పుర్ ప్రాంతంలో బస్సు-జీపు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 9 మంది మృతిచెందారు. మరో 30మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. బాధితులను ఆసుపత్రికి తరలించారు. బస్సు లఖ్నవూ నుంచి పిలిభీత్ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. బోల్తాపడటం వల్ల బస్సు కింద చాలా మంది చిక్కుకుపోయారని వివరించారు.
ప్రమాదఘటనపై విచారం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్. గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.