నీటిపై తేలియాడుతూ యోగా
ప్రపంచ యోగా దినోత్సవ వేళ తమిళనాడు రామేశ్వరానికి చెందిన ఇద్దరు సాధకులు పాక్ జలసంధి వద్ద.. సముద్రంలో ఆసనాలు వేసి అబ్బురపరిచారు. నీటిపై తేలియాడుతూ ఆశ్చర్యపరిచారు.
12:58 June 21
నీటిపై తేలియాడుతూ యోగా
ప్రపంచ యోగా దినోత్సవ వేళ తమిళనాడు రామేశ్వరానికి చెందిన ఇద్దరు సాధకులు పాక్ జలసంధి వద్ద.. సముద్రంలో ఆసనాలు వేసి అబ్బురపరిచారు. నీటిపై తేలియాడుతూ ఆశ్చర్యపరిచారు.
09:58 June 21
భౌతిక దూరంతో జేపీ నడ్డా యోగా సాధన
భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ యోగా సాధన చేశారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఆసనాలు వేశారు.
09:58 June 21
ఆసనమేసిన లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా దిల్లీలోని ఆయన నివాసంలో యోగాసనాలు వేశారు. శీర్షాసనం, ప్రాణయామం చేసి యోగా ఘనతను చాటారు.
09:45 June 21
ప్రకాశ్ జావడేకర్, గిరిరాజ్ సింగ్..
కేంద్రమంత్రులు ప్రకాశ్ జావడేకర్, ప్రహ్లాద్ పటేల్, గిరిరాజ్ సింగ్ వారి స్వహృహాల్లో యోగా సాధన చేశారు.
09:45 June 21
ఆసనమేసిన కేజ్రీ
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యోగా చేశారు. దిల్లీలోని స్వగృహంలో ధ్యానముద్రలో నిమగ్నమయ్యారు.
08:30 June 21
రాష్ట్రపతి కోవింద్ యోగా సాధన
ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ధ్యానంలో నిమగ్నమయ్యారు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్. రాష్ట్రపతి భవన్లో యోగా సాధన చేశారు.
08:29 June 21
అశ్వాలపై యోగా సాధన
అరుణాచల్ ప్రదేశ్‌లోని ఐటీబీపీ క్యాంప్‌లో గుర్రాలతో యోగా చేశారు సైనికులు. గుర్రాలపై నిల్చుని చేసిన ఆసనాలు సాధన చేశారు.
08:19 June 21
యోగా దినోత్సవ వేళ.. ముఖ్యమంత్రి శీర్షాసనం
యోగా దినోత్సవ వేళ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ శీర్షాసనం వేశారు. రాయ్‌పుర్‌లోని స్వగృహంలో యోగా సాధన చేశారు.
08:08 June 21
కేంద్రమంత్రుల యోగాసనాలు
కేంద్రమంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీలు వారి స్వగృహాల్లో యోగా సాధన చేశారు. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం నిబంధనలు పాటిస్తూ యోగా చేశారు.
07:59 June 21
భారత్- చైనా సరిహద్దులో యోగాసనాలు
భారత్- చైనా సరిహద్దులో భద్రీనాథ్కు సమీపంలోని వసుధార మంచుకొండ వద్ద ఐటీబీపీ దళాలు అద్భుతరీతిలో యోగా ప్రదర్శన చేశాయి. 14వేల అడుగుల ఎత్తులో చేసిన ఈ ప్రదర్శన చూపరులను విశేషంగా ఆకర్షించింది.
07:44 June 21
18వేల అడుగుల ఎత్తులో ఆసనమేసిన ఐటీబీపీ
యోగా దినోత్సవ వేళ ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్(ఐటీబీపీ) విభాగం లద్దాక్‌లో 18వేల అడుగుల ఎత్తులో ఆసనాలు వేశారు. మంచులో భద్రతా బలగాల ఆసనాలు ఆద్యంతం ఆకట్టుకునేలా ఉన్నాయి.
06:54 June 21
06:51 June 21
06:38 June 21
యోగాతో మనిషికి, ప్రకృతికి మధ్య సాన్నిహిత్యం
మానవ జీవన విధానంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు హోంమంత్రి అమిత్‌షా. యోగా ద్వారా శరీరానికి- మనస్సుకు, ఆలోచనలు- క్రియలకు, మనిషికి- ప్రకృతికి మధ్య సాన్నిహిత్యం ఏర్పడుతుందని చెప్పారు. మోదీ చేసిన కృషితోనే యోగాకు ప్రపంచదేశాల అంగీకారం లభించిందన్నారు. భారత సంస్కృతి ప్రపంచానికి ఇచ్చిన గొప్ప బహుమతి యోగా అని పేర్కొన్నారు.
06:15 June 21
'శాంతి, శ్రేయస్కర జీవన సూత్రాలకు యోగా ద్వారా ప్రచారం'
శాంతి, శ్రేయస్కర జీవన సూత్రాలకు యోగా ప్రచారం కల్పిస్తుందని ప్రకటించింది ఐరాస. ప్రపంచం అత్యంత సమస్యలను ఎదుర్కొంటున్న వేళ దేశాల మధ్య సంబంధానికి యోగా ఎంతో ఉపకరిస్తుందని స్పష్టం చేసింది.
05:51 June 21
కరోనా వారియర్స్‌కు కృతజ్ఞతగా.. 108 సూర్య నమస్కారాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుజరాత్ వడోదర లోని యోగా నికేతన్.. వర్చవల్‌గా యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా 15 దేశాలకు చెందిన పలువురు పాల్గొని కొవిడ్-19పై ముందుడి పోరాటం చేస్తోన్న వారికి కృతజ్ఞతగా 108 సూర్య నమస్కారాలు చేశారు.
05:46 June 21
హరిద్వార్‌లో బాబా రాందేవ్ 'యోగా'సనాలు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఉత్తరాఖండ్ హరిద్వార్‌లో పతాంజలి యోగ్పీత్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. యోగ్పీత్ వేదికపై బాబా రాందేవ్ యోగాసనాలు వేశారు. కరోనా నేపథ్యంలో చాలా తక్కవ సంఖ్యలో, భౌతిక ధూరం పాటిస్తూ పలువురు యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు.
05:30 June 21
యోగా డే: ఈసారి సందడంతా నెట్టింట్లోనే!
కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ఈ సారి అంతర్జాతీయ యోగా డే వేడుకలను పూర్తిగా డిజిటల్ ప్లాట్ఫాంలలోనే నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 2015 జూన్ 21 నుంచి ఏటా ఘనంగా నిర్వహిస్తున్న యోగా దినోత్సవాన్ని ఈసారి ఇంట్లో కుటుంబ సభ్యులతోనే జరుపుకోవాలని ఇప్పటికే స్పష్టం చేసింది ఆయూష్ మంత్రిత్వ శాఖ. ఆదివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే 'యోగా ఎట్ హోం అండ్ యోగా విత్ ఫ్యామిలీ' వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది.
యోగా డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం హైలైట్ కానుంది. ఇంట్లోనే వేడుకలు జరుపుకోవాలని ఆయన ఇప్పటికే సందేశమిచ్చారు.
యోగా డే ముఖ్యాంశాలు..
యోగాపై అవగాహన పెంచేందుకు పోటీలు..
శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడే యోగాపై అవగాహన పెంచేందుకు 'మై లైఫ్- మై యోగా' వీడియో బ్లాగింగ్ పోటీలను మోదీ చేతుల మీదుగా మే 31న ప్రారంభించింది భారత సాంస్కృతిక సంబంధాల సమాఖ్య. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనాపై పోరాడేందుకు అవసరమైన రోగ నిరోధక శక్తిని యోగా ద్వారా పెంచుకోవచ్చని తెలిపింది.
ఈ పోటీలను భారత్‌లో, అంతర్జాతీయంగా నిర్వహిస్తున్నారు. ఒక్కో దేశంలో నిర్వహించిన పోటీ నుంచి ఒక్కో విజేతను ఎంపిక చేస్తారు. వారంతా అంతర్జాతీయ స్థాయి పోటీలో పాల్గొనాలి.
3 నిమిషాలు 3 ఆసనాలు
పోటీలో పాల్గొనేవారు 3 యోగాసనాలతో 3 నిమిషాల నిడివి గల వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయాలి. #MyLifeMyYogaINDIA హ్యాష్‌ట్యాగ్ జత చేయాలి. యోగా ద్వారా తమ జీవితంలో వచ్చిన మార్పుపై సందేశమివ్వాలి.
యువత, పెద్దలు, యోగా వృత్తిలో ఉన్నవారికి మూడు విభాగాల్లో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో గెలుపొందిన మొదటి ముగ్గురు విజేతలకు 2500డాలర్లు, 1500డాలర్లు, 1000డాలర్లతో పాటు ట్రోఫీని బహుమతిగా ఇస్తారు.
భారత్‌లో మొత్తం ఆరు విభాగాల్లో యోగా పోటీలను నిర్వహిస్తున్నారు. ప్రతి విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా రూ.లక్ష, రూ.50వేలు, రూ.25వేలు అందజేస్తారు . ఆదివారంతో పోటీదారులకు ఇచ్చిన గడువు ముగుస్తుంది. విజేతల పేర్లను జ్యూరీ ప్రకటిస్తుంది.