దేశంలో కరోనా కేసులు నానాటికీ పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. భారత్లో తాజాగా 68,898 మంది కరోనా బారినపడగా.. మరో 983 మంది మృతి చెందారు. మొత్తం కేసులు 29 లక్షలు దాటాయి.
భారత్లో కరోనా కేసుల వివరాలు రికవరీ రేటు 74 శాతం దాటింది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 21 లక్షల 58 వేల 946 మంది కోలుకున్నారు. మరణాల రేటు 1.89 శాతానికి పడిపోయింది.
దేశంలో ఆగస్టు 7న 20 లక్షల మార్కు దాటగా.. మరో 2 వారాల్లో 9 లక్షల కేసులు నమోదవటం గమనార్హం.
మళ్లీ 8 లక్షల టెస్టులు..
మహారాష్ట్రలో అత్యధికంగా 6 లక్షల 43 వేల కేసులు ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 3 కోట్ల 34 లక్షల 67 వేల 237 నమూనాలను పరీక్షించారు. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 8 లక్షల 5 వేల 985 టెస్టులు చేశారు.
ఏ రాష్ట్రాల్లో కేసులు ఎలా..