ఆయనకు కరోనా సోకింది. అయినా అధైర్యపడలేదు. మొండిగా పోరాడాడు. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి ఆయన చేతిలో ఓడిపోయింది. అయితే వెనువెంటనే వచ్చిన మృత్యువును మాత్రం జయించలేకపోయాడు.
అసలేం జరిగింది?
ఆయనకు కరోనా సోకింది. అయినా అధైర్యపడలేదు. మొండిగా పోరాడాడు. ప్రపంచాన్ని వణికిస్తోన్న మహమ్మారి ఆయన చేతిలో ఓడిపోయింది. అయితే వెనువెంటనే వచ్చిన మృత్యువును మాత్రం జయించలేకపోయాడు.
అసలేం జరిగింది?
ఫిలిప్పీన్స్‌కు చెందిన 68 ఏళ్ల వృద్ధుడికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ముంబయి కస్తూర్బా ఆస్పత్రిలో ఆయనకు చికిత్స అందించారు. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నాడు. తర్వాత ఆయన్ను ఓ ప్రైవేటు ఆస్పత్రికి మార్చారు. అయితే మూత్రపిండాల వ్యాధితో సోమవారం మృతి చెందాడు.
ఆయనకు మధుమేహం, ఆస్తమా, మూత్రపిండాల వ్యాధి, శ్వాసకోస సమస్యలు ఉన్నాయని తెలిపింది కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
ఇదీ చదవండి:'ఎయిర్ ఇండియా' తెగువకు ప్రధాని ప్రశంసలు