భారత్లో కరోనా వైరస్ కారణంగా రెండో మరణం సంభవించింది. దిల్లీలో 68 ఏళ్ల వృద్ధురాలు రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో మరణించినట్లు వైద్యారోగ్య శాఖ, దిల్లీ అధికారులు ప్రకటించారు.
మృతి చెందిన వృద్ధురాలు తన కొడుకుతో కలిసి ఇటీవలే ఇటలీ, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించినట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 23న వారు భారత్కు తిరిగి వచ్చినట్లు పేర్కొన్నారు. అనంతరం వారిద్దరికీ పరీక్షలు నిర్వహించి మార్చి 7న రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు.