గతంలో అయోధ్య చట్టం కింద స్వాధీనం చేసుకున్న 67 ఎకరాల విస్తీర్ణంగల భూమిని సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా శనివారం శ్రీరామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌కు బదిలీ చేశారు అధికారులు. రామ మందిర నిర్మాణ పర్యవేక్షణ కోసం నియమంచిన 15 మంది సభ్యుల కమిటీ ఆధ్వర్యంలో బదిలీ కార్యక్రమాలు జరిగాయి.
సర్వాంగ సుందరంగా అయోధ్య..
అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఈ నెల 5న భూమి పూజ జరగనుంది. ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనుండగా.. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సహా సుమారు 200 మంది పాల్గొననున్నారు. ఇందుకోసం అయోధ్య నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు అధికారులు.
ఇదీ చదవండి:అయోధ్య రామమందిరానికి 'శ్రీరామ్ జన్మభూమి తీర్థక్షేత్ర' ట్రస్ట్