దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. మహారాష్ట్రలో వైరస్ తీవ్రరూపం దాల్చింది. ఇవాళ రికార్డు స్థాయిలో 6,555 కేసులు నమోదయ్యాయి. తమిళనాడు, దిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో వైరస్ వేగంగా విస్తరిస్తోంది.
'మహా'లో ఆగని కరోనా ఉద్ధృతి
By
Published : Jul 5, 2020, 9:21 PM IST
|
Updated : Jul 5, 2020, 9:56 PM IST
మహారాష్ట్రలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్యలో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే 6,555 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. మరో 151 మంది ప్రాణాలు కోల్పోయారు. వైరస్ నుంచి నేడు 3,658 మంది కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 2,06,619కి చేరింది. మరణాలు 8,822కు చేరగా.. ఇప్పటివరకు 1,11,740 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు.
తమిళనాడులో...
తమిళనాడులో కొవిడ్-19 పంజా విసురుతోంది. కొద్ది రోజులుగా రోజుకు నాలుగువేలకుపైగా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇవాళ 4,150 మందికి కొత్తగా వైరస్ పాజిటివ్‌గా తేలింది. మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు.
దిల్లీలో...
దిల్లీలో ఇవాళ మరో 2,505 కొత్త కేసుల నమోదుతో మొత్తం కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. మరణాలు సంఖ్య 3,067కు చేరింది. ఇవాళ 63 మంది ప్రాణాలు కోల్పోయారు.
బంగాల్లో..
బంగాల్లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఇవాళ రికార్డు స్థాయిలో 895 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు నమోదైన కేసుల సంఖ్యలో ఇదే అత్యధికం. ఈరోజు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 22,126కు మరణాలు 757కు చేరాయి.
వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న ఈశాన్య రాష్ట్రాల్లోనూ విస్తరిస్తోంది ఈ మహమ్మారి. అరుణాచల్‌ప్రదేశ్‌లో ఇవాళ 7, పుదుచ్చేరిలో 43, నాగాలాండ్‌లో 28 కొత్త కేసులు నమోదయ్యాయి.