లాక్డౌన్ కారణంగా వలస కార్మికులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. వారిని స్వస్థలాలకు చేరవేసేందుకు 'శ్రామిక్' పేరుతో ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది కేంద్రం. మే 1 నుంచి ఇప్పటివరకు 642 శ్రామిక్ రైళ్లలో 8లక్షల మందిని స్వస్థలాలకు చేరవేసినట్లు అధికారుల తెలిపారు. ఇందులో అత్యధికంగా 301రైళ్లు ఉత్తరప్రదేశ్‌కు చేరగా...169 రైళ్లతో బిహార్ ఆ తర్వాతి స్థానంలో ఉన్నట్లు వెల్లడించారు.
ఏ రాష్ట్రానికి ఎన్ని?
మధ్యప్రదేశ్‌కు 53, ఝార్ఖండ్‌కు 40, ఒడిశాకు 38, రాజస్థాన్‌కు 8, బంగాల్‌కు 7, ఛత్తీస్‌గఢ్ 6, ఉత్తరాఖండ్‌కు 4 ప్రత్యేక రైళ్లు నడిపినట్లు అధికారులు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్, జమ్ముకశ్మీర్, మహారాష్ట్రలకు 3 రైళ్లు చొప్పున ప్రయాణించినట్లు చెప్పారు. తెలంగాణ, తమిళనాడు, మిజోరం, మణిపూర్, త్రిపుర, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లకు ఒక్క రైలు మాత్రమే నడిచినట్లు రైల్వేశాఖ వివరించింది.