దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. మహారాష్ట్ర, దిల్లీ, కర్ణాటక, బంగాల్, గుజరాత్ రాష్ట్రాల్లో రోజురోజుకు కొత్త కేసుల్లో రికార్డులు నమోదవుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం కేసులు 6 లక్షలు దాటగా, మరణాలు 18వేలకు చేరువయ్యాయి.
మహాలో 6వేలకుపైగా..
మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గురువారం ఒక్క రోజే 6,330 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. మరో 125 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,86,626కు చేరింది. ఇప్పటి వరకు 1,01,172 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం 8,178 మంది మరణించారు.
ముంబయిలో..
మహారాష్ట్ర రాజధాని ముంబయిలో కరోనా మహమ్మారి పంజా విసురుతోంది. తాజాగా 1554 కేసులు నమోదయ్యయి. మరో 57మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 80,262కు చేరింది.
దిల్లీలో..
దేశ రాజధాని దిల్లీలో.. కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించిన కరోనా మళ్లీ విజృంభిస్తోంది. తాజాగా 2373మందికి వైరస్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. మరో 61మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 92,175కు చేరగా.. 2,864 మంది ప్రాణాలు కోల్పోయారు. 63,007 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. 26,304 మంది చికిత్స పొందుతున్నారు.
కర్ణాటకలో..
కర్ణాటకలో గురువారం 1502 కరోనా కేసులు బయటపడ్డాయి. మరో 19మంది మృతి చెందారు. మొత్తం కేసుల సంఖ్య 18,016కు చేరింది.
బంగాల్లో..
బంగాల్లో 649 కొత్త కేసులు నమోదయ్యాయి. 16మంది మరణించారు. గురువారం ఒక్క రోజే 509మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మొత్తం కేసుల సంఖ్య 19,819కి చేరింది. 699 మంది ప్రాణాలు కోల్పోయారు.
రాజస్థాన్‌లో..