దేశంలో కరోనా కేసులు 29 వేల 435కు చేరాయి. ఇప్పటివరకు 934 మంది కొవిడ్ కారణంగా మరణించారు. 24 గంటల వ్యవధిలోనే భారత్లో 1543 కొత్త కేసులు నమోదుకాగా.. 62 మంది చనిపోయారు. ఒక్కరోజులో నమోదైన మరణాల సంఖ్యలో ఇదే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
24 గంటల్లో దేశంలో 62 కరోనా మరణాలు - రికవరీ
భారత్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోంది. 24 గంటల వ్యవధిలోనే 1543 కొత్త కేసులు, 62 మరణాలు సంభవించాయి. ఒక్కరోజులో ఇంత మంది మృతి చెందడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మొత్తం మరణాల సంఖ్య 934కు చేరింది.
24 గంటల వ్యవధిలోనే దేశంలో 62 మరణాలు
మొత్తం 6,868 మంది కోలుకోగా.. ప్రస్తుతం 21 వేల 632 యాక్టివ్ కేసులున్నాయి.
భారత్లో కరోనాకు కేంద్రంగా ఉన్న మహారాష్ట్రలో కేసులు 8590కి చేరాయి. రాష్ట్రంలో 1282 మంది కోలుకున్నారు. మరో 369 మంది ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్లో కరోనా మృతుల సంఖ్య 162కు పెరిగింది. మధ్యప్రదేశ్లో 110, దిల్లీలో 54, రాజస్థాన్లో 46 చొప్పున మరణించారు.