భారత్‌లో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. ఒక్కరోజులో నమోదవుతున్న కేసుల సంఖ్యలో మళ్లీ పెరుగుదల కనిపించింది. తాజా 60,963 మంది వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23 లక్షల మార్కును దాటింది. మరో 834 మంది కొవిడ్‌తో ప్రాణాలు కోల్పోయారు.
ఆగస్టు 7న భారత్‌లో కేసుల సంఖ్య 20లక్షలు దాటగా... ఐదు రోజుల వ్యవధిలోనే మరో 3లక్షలు కేసులు నమోదయ్యాయి. మరోవైపు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 6,43,948 ఉండగా... ఇది మొత్తం కేసుల్లో 27.64 శాతమే.