తెలంగాణ

telangana

ETV Bharat / bharat

60 ఏళ్ల వరుడు.. జర్మనీ ప్రేయసిని మూడోసారి పెళ్లాడాడు! - old couple of india and germany married in janad=gadh

గుజరాత్​లో ఓ వృద్ధ ప్రేమ జంట ఘనంగా పెళ్లి చేసుకుంది. 60 ఏళ్ల వయసులో పెళ్లంటే షష్టిపూర్తి అనుకునేరు.. కాదు కాదు.. పూర్తిగా హిందూ ఆచారాల ప్రకారం జరిగిన వివాహమహోత్సవమే. ముచ్చటగా మూడోసారి పెళ్లి మరి... ఆ మాత్రం హడావుడి ఉండదా ఏమిటి?

60 YEAR OLD MAN MARRIED WITH GERMAN WOMAN IN JUNAGADH GUJARAT
60 ఏళ్ల వరుడు.. జర్మనీ ప్రేయసిని మూడోసారి పెళ్లాడాడు!

By

Published : Jan 24, 2020, 8:32 PM IST

Updated : Feb 18, 2020, 7:01 AM IST

60 ఏళ్ల వరుడు.. జర్మనీ ప్రేయసిని మూడోసారి పెళ్లాడాడు!

గుజరాత్​ జునాగఢ్​ జిల్లా ఉనా తాలుకా సంఖడా గ్రామంలో ఓ వృద్ధ జంట వివాహం.. స్థానికులకు కనువిందు చేసింది.

60 ఏళ్ల నితిన్​భాయ్​.. 1990లో కొన్ని అనివార్య కారణాల వల్ల మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఇక వ్యాపార నిమిత్తం జర్మనీలోని హిల్జెన్​బర్గ్​కు వెళ్లిపోయాడు. 2002లో ఓ పనిమీద మారిషస్​ దేశానికి వెళ్లాడు. అక్కడే.. నితిన్​కు జర్మనీకి చెందిన ఎలెన్​ కలిసింది. ఆ తరువాత వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

ముచ్చటగా మూడు సార్లు..

ఎనిమిదేళ్లు గాఢమైన ప్రేమలో మునిగి తేలాక.. 2010 జనవరి 22న అహ్మదాబాద్ రిజిస్ట్రార్​ ఆఫీస్​లో తొలిసారిగా వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత కొన్నాళ్లకు జర్మనీ సంప్రదాయం ప్రకారం మరో సారి వివాహమాడారు. కానీ, హిందూ సంప్రదాయం ప్రకారం ఏడడుగులు వేయలేదు కాబట్టి ఆ ముచ్చటా తీర్చుకోవాలనుకున్నారు. అందుకే గత బుధవారం తమ పదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా.. హిందూ ఆచారాల ప్రకారం ముచ్చటగా మూడోసారి ఒక్కటయ్యిందీ జంట.

ఇదీ చదవండి: దిల్లీ దంగల్​: 'కామ్​ కీ చాయ్​'తో ఆప్​ నయా ప్రచారం

Last Updated : Feb 18, 2020, 7:01 AM IST

ABOUT THE AUTHOR

...view details