దేశ పౌరుల కోసం నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ను ఇటీవలే ప్రారంభించారు ప్రధాని మోదీ. ఇందులో భాగంగా ప్రతి పౌరుడికి హెల్త్ ఐడీ అందించనున్నారు. ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించిన వివరాలన్నీ ఆన్లైన్లో పొందుపర్చనున్నారు. దేశంలోని ఏ వైద్యుడి వద్దకు వెళ్లినా.. ఈ కార్డు ఇస్తే వారికి మన వివరాలు తెలుస్తాయి. అయితే ఈ నిర్ణయాన్ని దాదాపు 60 శాతం మంది స్వాగతించారు. కొందరు మాత్రం వ్యక్తిగత గోప్యతపై ప్రశ్నలను లేవనెత్తినట్లు లోకల్ సర్కిల్స్ అనే సోషల్ మీడియా ప్లాట్ఫాం తన నివేదికలో వెల్లడించింది.
సర్వేలోని కీలకాంశాలు..
- హెల్త్ ఐడీ అవసరమా? అనే విషయంపై దాదాపు 9వేల మంది స్పందించారు.
- భారతీయులందరికీ డిజిటల్ హెల్త్ ఐడీలను రూపొందించాలన్న నేషనల్ హెల్త్ డేటా మేనేజ్‌మెంట్ పాలసీపై నాలుగు ప్రశ్నలు వేశారు సర్వే నిర్వాహకులు. ఇందుకు సుమారు 34,000 స్పందనలు వచ్చాయి.
- డిజిటల్ హెల్త్ కార్డు నిర్ణయం మంచిదేనని 59 శాతం మంది అభిప్రాయపడ్డారు. అయితే ఆరోగ్య, వైద్య రికార్డులు తప్ప వ్యక్తిగత, సున్నిత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకునేందుకు అయిష్టం చూపారు.
- 23 శాతం మంది హెల్త్ ఐడీ రూపొందించడానికి మద్దతు ఇచ్చారు. ఈ సదుపాయంతో వేగంగా ఆరోగ్యసేవలు అందిచవచ్చని వారంతా భావిస్తున్నారు. 18 శాతం మంది ఈ కార్డు వల్ల వ్యక్తిగత, సున్నితమైన డేటాకు ముప్పు ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
- రోగ నిర్ధరణ- పరిష్కారాలు, పరిశోధన కోసం హెల్త్ ఏజెన్సీలకు డేటాను అందుబాటులో ఉంచడంపై అభిప్రాయం అడిగినప్పుడు.. 48 శాతం మంది ఆ నిర్ణయాన్ని స్వాగతించలేదు. 45 శాతం అంగీకరించగా.. 6 శాతం మంది ఏ నిర్ణయం చెప్పలేమన్నారు.
సెప్టెంబర్ 21 వరకు..