ముద్దు ముద్దు మాటలు చెబుతూ అప్పుడే బడికెళ్లాల్సిన వయసది. కానీ, ఓ ఆరేళ్ల బాలుడు.. అనారోగ్యంతో ఉన్న తన తాతయ్యను ఆసుపత్రిలో వార్డు మార్చేందుకు స్వయంగా స్ట్రెచర్‌ను తోసుకుంటూ వెళ్లాడు. వార్డు బాయ్ ఇందుకు రూ. 30 వసూలు చేస్తుండటమే కారణం.
తల్లి సాయంతో..

ఉత్తర్‌ప్రదేశ్ బర్హజ్ ప్రాంతంలోని గౌరా గ్రామానికి చెందిన చెడీ యాదవ్ ఇటీవల గాయపడ్డాడు. అతడి కూతురు, మనుమడు దేవరియా జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు సర్జికల్ వార్డులో చేర్పించాలని సూచించారు. వార్డు మార్చేందుకు ఆస్పత్రి సిబ్బందికి రూ.30 ఇవ్వలేక.. తల్లి సాయంతో స్ట్రెచర్‌ను తోసుకుంటూ వెళ్లాడు ఆ ఆరేళ్ల బాలుడు. ఈ దృశ్యాన్ని అక్కడివారు తమ చరవాణుల్లో చిత్రీకరించారు.
ఈ వీడియో వైరల్ కావడంవల్ల.. దేవరియా జిల్లా కలెక్టర్ స్పందించారు. ఇందుకు కారణమైన ఆ వార్డు బాయ్‌ని తక్షణమే విధుల నుంచి తొలగించారు. సమగ్ర దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చదవండి:లేహ్ నుంచి దిల్లీకి ఆకాశమార్గాన అమృత ధారలు