గిన్నిస్ రికార్డులో చోటు కోసం అద్భుతం చేశాడు పంజాబ్‌కు చెందిన ఆరేళ్ల బుడతడు. కళ్లకు గంతలు కట్టుకొని 16 కిలోమీటర్లు స్కేటింగ్ చేశాడు. ప్రణవ్ చౌహాన్ చేసిన ఈ సాహసానికి లుధియానాలోని లేయర్ వ్యాలీ స్కేటింగ్ స్టేడియం వేదికైంది.
ఈ ఫీట్‌ను సాధించడానికి గంటా 16 నిమిషాల సమయం తీసుకున్నాడు ప్రణవ్. అయితే ఆ బాలుడి ప్రయత్నాన్ని గిన్నిస్ అధికారులు ఇంకా ధ్రువీకరించాల్సి ఉంది.