తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అయోధ్య తీర్పుపై ఒకే రోజు ఆరు రివ్యూ పిటిషన్లు - అయోధ్య తీర్పుపై ఒకే రోజు 6 రివ్యూ పిటిషన్లు

అయోధ్య రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంలో గత నెల ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని సుప్రీం కోర్టులో నేడు 6 పిటిషన్లు దాఖలయ్యాయి. తమకు అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మద్దతున్నట్లు తెలిపారు పిటీషనర్లు.

Review petitions
అయోధ్య తీర్పుపై ఒకే రోజు 6 రివ్యూ పిటిషన్లు

By

Published : Dec 6, 2019, 7:27 PM IST

అయోధ్య వివాదంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై సమీక్ష కోరుతూ.. ఇవాళ 6 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. మౌలానా ముఫ్తీ హస్బుల్లా, మొహద్‌ ఉమర్‌, మౌలానా మహఫుజూర్‌ రెహమాన్‌, మిస్బాహుద్దీన్‌, హాజీ నహబూబ్‌ సర్వోన్నత న్యాయస్థానంలో.. వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

నవంబర్‌ 9 నాటి తీర్పును పునఃసమీక్షించాలని ఈ పిటిషన్లలో పేర్కొన్నారు. తమకు అఖిల భారత ముస్లిం పర్సనల్‌ లా బోర్డు మద్దతున్నట్లు తెలిపారు పిటీషనర్లు.

సుప్రీం తీర్పుపై డిసెంబర్‌ 2న తొలి రివ్యూ పిటిషన్‌ దాఖలైంది. జమాయిత్‌ ఉలేమా ఇ హింద్ మొదటి పిటిషన్‌ దాఖలు చేసింది.

ఇదీ చూడండి: 'బాబ్రీ మసీదు'కు 27 ఏళ్లు.. అయోధ్యలో భద్రత కట్టుదిట్టం

ABOUT THE AUTHOR

...view details