మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్యాంకర్-వ్యాను ఢీకొనగా ఆరుగురు మృతి చెందారు. ధార్ జిల్లా ఛిఖాలియా వద్ద ఇందోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై జరిగిందీ ఘటన.
ట్యాంకర్-వ్యాను ఢీ.. ఆరుగురు దుర్మరణం - road accidents
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వ్యానును ట్యాంకర్ ఢీకొట్టగా.. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.
ట్యాంకర్-వ్యాను ఢీ.. ఆరుగురు మృతి
ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. కూలీలను తీసుకువస్తున్న వాహనం మార్గమధ్యలో పంక్చరై ఆగిపోగా.. వేగంగా వస్తున్న ట్యాంకర్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఘటనాస్థలం నుంచి ట్యాంకర్ డ్రైవర్ పరారయ్యాడు. మృతులు ధార్ జిల్లా ఠండా గ్రామస్థులని పోలీసులు తెలిపారు.