తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హైదరాబాద్​​ మీదుగా హై-స్పీడ్​ కారిడార్​! - తెలుగు తాజా జాతీయం వార్తలు

హైస్పీడ్​, సెమీ-హైస్పీడ్​ కారిడార్ల కోసం కొత్తగా ఆరు విభాగాలను గుర్తించింది రైల్వే బోర్డు. ఏడాదిలోపు వీటిపై సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్​)ను సిద్ధం చేయనున్నట్లు బోర్డు ఛైర్మన్​ వీకే యాదవ్​ తెలిపారు.

6 more routes identified for high-speed corridors, DPR in a year: Railways
హైదరాబాద్​​ మీదుగా హై-స్పీడ్​ కారిడార్​!

By

Published : Jan 29, 2020, 7:17 PM IST

Updated : Feb 28, 2020, 10:33 AM IST

హైస్పీడ్​, సెమీ హైస్పీడ్ మార్గాలను విస్తృతం చేసేందుకు రైల్వే శాఖ శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కారిడార్ల కోసం కొత్తగా ఆరు విభాగాలను గుర్తించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్​ వీకే యాదవ్ తెలిపారు. వీటిపై ఏడాది లోపు సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్​)ను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.

ముంబయి- అహ్మదాబాద్​ హైస్పీడ్​ మార్గం ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఈ కొత్త కారిడార్లు కూడా ఈ జాబితాలో చేరనున్నాయి. హై స్పీడ్​ కారిడార్​లో గంటకు 300కిలోమీటర్ల కంటే అధిక వేగంతో రైళ్లు ప్రయాణించగలవు. ఇక సెమీ హైస్పీడ్​లో గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్లు దాటే అవకాశం ఉంది.

మొత్తం ఆరు కారిడార్లు ఇవే...

దిల్లీ- నోయిడా- ఆగ్రా- లఖ్​నవూ- వారణాసి(865 కి.మీ)

దిల్లీ-జైపుర్​- ఉదయ్​పుర్​- అహ్మదాబాద్​( 886కి.మీ)

ముంబయి- నాసిక్​- నాగ్​పుర్​(753 కి.మీ)

ముంబయి- పుణె- హైదరాబాద్​( 711 కి.మీ)

చెన్నై- బెంగళూరు- మైసూర్​( 435కి.మీ)

దిల్లీ- చండీగఢ్- లుధియానా- జలంధర్​- అమృత్​సర్​ (435 కి.మీ)

''ప్రస్తుతానికి ఆరు కారిడార్లను గుర్తించాం. వాటి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఐర్​)ను ఏడాదిలోగా పూర్తి చేస్తాం. భూమి లభ్యత, ట్రాఫిక్​ సామర్థ్యాన్ని పరిశీలించడం, ఈ మార్గాల సాధ్యాసాధ్యాలను డీపీఆర్​ అధ్యయనం చేయనుంది. ఆ తర్వాత అవి హైస్పీడ్​ లేదా సెమీ హైస్పీడ్​ కారిడార్లా అనే విషయాన్ని నిర్ణయిస్తాము.''

-వీకే యాదవ్, రైల్వే బోర్డు ఛైర్మన్​

ముంబయి- అహ్మదాబాద్​ మధ్య నిర్మిస్తున్న దేశంలోనే మొట్టమొదటి హైస్పీడ్​ కారిడార్​ ప్రాజెక్టు 2023 డిసెంబరు నాటికి పూర్తవుతుందని యాదవ్​ తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో 6 కారిడార్ల ప్రాజెక్టుకు 90 శాతం భూసేకరణ పనులు పూర్తవుతాయని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:బడ్జెట్‌పై కోటి ఆశలున్నా...ఆర్థిక వ్యవస్థలో 'నిర్మల'త్వం ఏదీ!

Last Updated : Feb 28, 2020, 10:33 AM IST

ABOUT THE AUTHOR

...view details