పట్నా నుంచి దిల్లీ వెళ్తున్న విమానంలో ఓ ఆరునెలల చిన్నారి మృతిచెందింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చిన్నారిని.... చికిత్స కోసం తీసుకువెళ్తున్న సమయంలో ఈ విషాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
విమానంలో ఆరు నెలల చిన్నారి మృతి - గుండెపోటు
ఆరు నెలల చిన్నారి... పట్నా నుంచి దిల్లీ వెళ్తోన్న ఓ విమానంలో మరణించింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పాపను చికిత్స కోసం దిల్లీకి తీసుకువెళ్తుండగా ఈ విషాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
'బిహార్ బెగుసరై జిల్లాకు చెందిన చిన్నారి రచిత కుమారికి పుట్టుకతోనే గుండెలో చిన్న రంధ్రం ఉంది. పాపకు దిల్లీలోని ఆల్ ఇండియా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. చిన్నారి తల్లిదండ్రులు రాజేంద్ర రాజన్, డింపుల్ మరోసారి వైద్య పరీక్షల నిమిత్తం పాపను దిల్లీకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. పట్నా నుంచి దిల్లీకి విమానంలో బయలుదేరారు. మార్గమధ్యంలో చిన్నారి మరణించింది. ఈ విషయంలో తల్లిదండ్రులు ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేయలేదు' అని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:- బ్రిటన్ హోంమంత్రిగా భారత సంతతి మహిళ