ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎటావా సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ట్రక్కులు ఢీకొని ఆరుగురు రైతులు మృతి చెందగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన రైతును సైఫై మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులు మార్కెట్‌లో పండ్లు విక్రయించడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని జిల్లా ఎస్పీ ఆర్.సింగ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో రైతులు మృతి చెందిన ఘటనపై ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ దిగ్బ్రింతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.