సరిహద్దు భద్రతలో భారత సైన్యం మరింత బలోపేతమైంది. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి పూర్తిగా స్వదేశీ పరిజ్జానంతో తయారు చేసిన ధనుష్ శతఘ్నులు సైన్యానికి అందుబాటులోకి వచ్చాయి. మొత్తం 114 ధనుష్ శతఘ్నులను తయారు చేయాల్సి ఉంది ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (ఓఎఫ్‌బీ). ప్రస్తుతానికి ఆరు శతఘ్నులను మధ్యప్రదేశ్ జమల్పురలో జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో సైన్యానికి అప్పగించింది ఓఎఫ్‌బీ. మేకిన్ ఇండియా కార్యక్రమం ద్వారా భారత సైన్యానికి అందుతున్న తొలి శతఘ్ని ధనుష్. దీని బరువు 13టన్నుల లోపే ఉంటుంది.
ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ బోర్డు, డీఆర్‌డీవో, డీజీక్యూఏ, డీపీఎస్‌యూ, భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్, సెయిల్‌తో పాటు పలు ప్రైవేటు సంస్థలు సంయుక్తంగా ధనుష్ శతఘ్నులను తయారు చేస్తున్నాయి.
ధనుష్ ప్రత్యేకతలు
⦁ ఆటోమేటెడ్ టెక్నాలజీతో ఒకేసారి మూడు నుంచి ఆరు శతఘ్నులతో ఒకే లక్ష్యం వైపు కాల్పులు జరపవచ్చు.