జమ్ముకశ్మీర్ స్థానిక సంస్థల (డీడీసీ) ఎన్నికలకు గురువారం ఐదో విడత పోలింగ్ జరగనుంది. మొత్తం 37 స్థానాలకు 299 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 8,27,519 ఓటర్లు వీరి భవితవ్యం తేల్చనున్నారు. ఇందులో పురుష ఓటర్లు 4,33,285 మంది, మహిళా ఓటర్లు 3,94,234 మంది.
ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే పోలింగ్ జరగనుంది.
కశ్మీర్ డివిజన్లోని 17 స్థానాలకు 155 మంది అభ్యర్థులు తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అందులో 30 మంది మహిళలు. జమ్ము డివిజన్లో 20 డీడీసీ నియోజకవర్గాల్లో 40 మంది మహిళలు సహా 144 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.