తమిళనాడులో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. మరో 5,986 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3,61,435కి చేరింది. ఏకంగా 116 మంది మృత్యువాత పడ్డారు. ఫలితంగా రాష్ట్రంలో మరణాల సంఖ్య 6,239కి పెరిగింది. 5,742 మంది తాజాగా కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో రికవరీల సంఖ్య 3,01,913కి చేరింది. ప్రస్తుతం 53,283 యాక్టివ్ కేసులున్నాయి.
కేరళలో కొత్తగా 1,968 కరోనా కేసులు వెలుగులోకి వచ్చాయి. 9 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసులు 52 వేలు దాటాయి. 18,123 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.
రాజధాని
దిల్లీలో మరో 1,215 కరోనా కేసులు గుర్తించారు అధికారులు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,57,354కి చేరింది. మరో 22 మంది కొవిడ్ ధాటికి ప్రాణాలు కోల్పోగా.. మొత్తంగా 4,257 మంది మృత్యువాత పడ్డట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 1,059 మంది డిశ్చార్జ్ అయినట్లు తెలిపారు. మొత్తం రికవరీల సంఖ్య 1,41,826గా ఉన్నట్లు స్పష్టం చేశారు.
మణిపుర్