తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా'లో కరోనా విలయతాండవం.. కొత్తగా 11,147 కేసులు - covid-19 pandemic

మహారాష్ట్రలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. 24 గంటల్లోనే 11,147 కొత్త కేసులు నమోదయ్యాయి. మరో 266మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4లక్షల 11వేలు దాటింది. తమిళనాడులోనూ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కొత్తగా 5,864 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 97 మంది ప్రాణాలు కోల్పోయారు.

corona cases in india
శాంతించని కరోనా

By

Published : Jul 30, 2020, 7:06 PM IST

Updated : Jul 30, 2020, 8:45 PM IST

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. కొత్తగా 11,147 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 266మంది మృతి చెందారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4,11,798కి పెరిగింది. 2,48,615 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు.

తమిళనాడులో..

తమిళనాడులో కొత్తగా 5,864 కేసులు నమోదయ్యాయి. మరో 97మంది వైరస్​కు బలయ్యారు. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2,39,978కి చేరింది. మృతుల సంఖ్య 3,838కి పెరిగింది. ప్రస్తుతం 57,962 యాక్టివ్​ కేసులున్నాయి.

కర్ణాటకలో..

కర్ణాటకలోనూ కరోనా కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. మరో 6,128 మందికి వైరస్​ సోకింది. 24 గంటల్లో 83మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,18,632కి చేరింది. ఇప్పటివరకు 2,230 మంది మృత్యువాతపడ్డారు.

యూపీలో రికార్డు

ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్​ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ఒక్కరోజులో అత్యధికంగా 3,705 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 57 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 81,039కి చేరింది. మృతుల సంఖ్య 1,587కి పెరిగింది.

రాజస్థాన్​లో 365..

రాజస్థాన్​లో కొత్తగా నమోదైన 365 కేసులతో కలిపి మొత్తం బాధితుల సంఖ్య 40,145కి చేరింది. మరో 9మంది వైరస్​ కారణంగా ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 663కి పెరిగింది.

దిల్లీలో వెయ్యికి పైగా..

దేశ రాజధాని దిల్లీలో 24 గంటల్లో 1,035 కేసులు నమోదయ్యాయి. మరో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 1,33,310కి చేరింది. ఇప్పటివరకు 3,907 మంది మరణించారు.

ఇదీ చూడండి: త్వరలోనే రోజుకు 10 లక్షల కరోనా పరీక్షలు!

Last Updated : Jul 30, 2020, 8:45 PM IST

ABOUT THE AUTHOR

...view details