తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కరోనా చికిత్స ఖర్చుపై 57 శాతం మంది ఆందోళన! - private hospitals covid-19 treatment high price

ప్రైవేటు ఆస్పత్రులలో కరోనా వైద్య చికిత్సకు ఖర్చు ఎక్కువగా ఉంటోందని 57 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. ఆస్పత్రులలో సరైన ప్రమాణాలు లేని కారణంగా రద్దీగా ఉండటం వల్ల కరోనా బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని 46 శాతం మంది భావిస్తున్నారు.

57% worried of high-priced COVID-19 treatment in pvt hospitals: Survey
కరోనా చికిత్సకు ఖర్చు ఎక్కువని 57 శాతం మంది ఆందోళన!

By

Published : May 30, 2020, 10:28 PM IST

కరోనా కేసులు నమోదైన తొలినాళ్లలో ప్రభుత్వ ఆస్పత్రులలో చికిత్స అందించేవారు. ఆ తర్వాత కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగాక ప్రైవేటు ఆస్పత్రులకూ చికిత్స చేసేందుకు అనుమతిచ్చారు. అయితే ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అయ్యే ఖర్చు భరించలేని స్థాయిలో ఉంటోందని 57 శాతం మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సామాజిక మాధ్యమం లోకల్ ​సర్కిల్స్​ నిర్వహించిన ఓ సర్వేలో ఇందుకు సంబంధించి ప్రజలు తమ అభిప్రాయాలను తెలిపారు. మొత్తం 40 వేల మంది ఈ సర్వేలో పాల్గొన్నారు.

ఆస్పత్రులలో రద్దీ, సరైన ప్రమాణాలు పాటించని కారణంగా వైరస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలో పాల్గొన్న 46 శాతం మంది అభిప్రాయపడ్డారు. దేశంలో సరైన మౌలిక వైద్య సదుపాయాలు లేవని, అదే ప్రధాన సమస్య అని 32 శాతం మంది తెలిపారు.

ప్రభుత్వమే నిర్ణయించాలి..

ప్రభుత్వమే ప్రైవేటు ఆస్పత్రులలో కొవిడ్ చికిత్సకు అయ్యే ఖర్చును నిర్ణయించాలని, ఆస్పత్రులలో సదుపాయాలు, రేటింగ్స్​​ ఆధారంగా దీనిపై అంచనాకు రావాలని 61 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆస్పత్రులలో రద్దీగా ఉండటం వల్ల చాలా సేపు నిల్చోవాల్సి వస్తోందని 16 శాతం మంది చెప్పారు.

ఒకవేళ కరోనా బారిన పడితే మీరు ఏ ఆస్పత్రికి వెళ్తారని అడగ్గా.. 32 శాతం మంది ప్రైవేటు ఆస్పత్రులకే మొగ్గు చూపారు. 22 శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రులలోనే చికిత్స తీసుకుంటామన్నారు. మరో 32 శాతం మంది మాత్రం ఆస్పత్రులకు వెళ్లడానికి ఇష్టం లేదని చెప్పారు. 14 శాతం సందిగ్ధం వ్యక్తం చేశారు.

ఇంటి నుంచే చికిత్స తీసుకుంటామని, అత్యవసరమైతేనే ఆస్పత్రికి వెళ్తామని 32 శాతం మంది చెప్పినట్లు లోకల్​ సర్కిల్స్ జనరల్ మేనేజర్​ అక్షయ్​ గుప్తా తెలిపారు.

కరోనా కారణంగా ఇప్పటికే అనేక మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, చికిత్స ఖర్చు ఎక్కువైతే భరించలేమని సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే ఈ విషయంపై నిర్ణయం తీసుకుని ఖర్చు తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ సర్వే వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్తామని నిర్వహకులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details