బిహార్‌కు వేర్వేరు రాష్ట్రాల నుంచి తిరిగి వచ్చిన 10వేల 385మంది వలస కార్మికుల్లో 560మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మే 16 వరకు నమోదైన ఈ గణాంకాల్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఈ 560మందిలో 172మంది దిల్లీ నుంచి వచ్చినట్టు వివరించింది. మరో 123 మంది మహారాష్ట్ర, 26మంది బంగాల్ నుంచి బిహార్‌కు వచ్చినట్టు స్పష్టం చేసింది. మరో 2,746మంది పరీక్షల ఫలితాలు ఇంకా రాలేదని వెల్లడించింది.