లాక్డౌన్ కారణంగా బడి గంటలు మూగబోయాయి. దీంతో పిల్లలంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఈ కారణంగా ఇప్పటికే దేశంలో 85 శాతానికి పైగా తల్లిదండ్రులు వారి పిల్లల చదువు, భవిష్యత్తు గురించి బెంగ పెట్టేసుకున్నారని అధ్యయనాలు వెల్లడించాయి. "ఆ ఏముంది... ఆన్లైన్ క్లాసులు పెట్టిస్తే వారే చదువుకుంటారు అనుకుంటే పొరపాటే" అంటోంది ఓ సర్వే. దేశంలో 35 కోట్ల మంది విద్యార్థులుంటే... వీరిలో 56 శాతానికిపైగా అసలు స్మార్ట్ఫోన్ సౌలభ్యమే లేదని తేల్చింది.
దేశమంతా ఇదే పరిస్థితి...
బాలల హక్కుల ఎన్జీఓ స్మైల్ ఫౌండేషన్.. విద్యార్థులు సాంకేతికతను ఎంత మేరకు వినియోగించుకుంటున్నారో తెలుసుకునేందుకు.. 'కరోనా కాలంలో ప్రస్తుత పరిస్థితులు-పరిష్కారాలు' అనే అంశంపై సర్వే నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దిల్లీ, కర్ణాటక, తమిళనాడు, బంగాల్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి 23 రాష్ట్రాల్లో.. 12 రోజుల పాటు సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనంలో 42,831 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
వీరిలో 43.99 శాతం మంది విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను వినియోగించుకుంటున్నారు. 43.99 శాతం మంది సాధారణ మొబైల్స్ వాడగలుగుతున్నారు. మరో 12.02 శాతం మందికి అసలు ఏ ఫోనూ లేదు.
టీవీ విషయానికొస్తే...