దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోంది. అయితే కేరళలో మాత్రం కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. ఒక్కరోజే 5,457 మంది వైరస్ బారిన పడ్డారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 90 వేలకు చేరువైంది.
తమిళనాడులో కొత్తగా 2,522 మందికి కరోనా సోకగా... మరో 27 మంది మరణించారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 14 వేలు దాటింది. 6 లక్షల 75 వేల మందికి పైగా కరోనా జయించారు.
- ఉత్తర్‌ప్రదేశ్‌లో తాజాగా 2,018 కేసులు నమోదయ్యాయి. మరో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 4 లక్షల 74 వేలు దాటింది.
- ఒడిశాలో కొత్తగా 1,247 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలగా... మరో 13 మంది కొవిడ్‌కు బలయ్యారు.
- కేంద్రమంత్రి రాందాస్ అథవాలేకు కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. దీంతో ఆయన ముంబయిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు.
11 వారాల్లో అత్యల్పం..