కరోనా, భారత్కు మధ్య జరుగుతున్న యుద్ధంలో ముందుండి పోరాడుతున్న వైద్యులతో పాటు విలేకరులు, పోలీసులు ప్రమాదంలో పడుతున్నారు. ముంబయిలో ప్రాణాలకు తెగించి కొవిడ్-19 వివరాలు సేకరిస్తోన్న 53 మంది జర్నలిస్టులు కరోనా మహమ్మారికి చిక్కారు. అహ్మదాబాద్లో విధులు నిర్వహిస్తోన్న 24 మంది పోలీసులు వైరస్ బారిన పడ్డారు.
మీడియాపై మహమ్మారి..
క్షేత్ర స్థాయి వార్తలు సేకరించే జర్నలిస్టులు తప్పని పరిస్థితుల్లో జన సమూహాల్లోకి వెళ్తున్నారు. ముంబయిలో 53 మంది విలేకరులు కరోనా బారిన పడ్డారు. వీరిలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులే అధికంగా ఉన్నారని స్పష్టం చేశారు.. టీవీ జర్నలిస్ట్ అసోయేషన్(టీవీజేఏ) అధ్యక్షుడు వినోద్ జగదళే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు.
వైరస్ బాధితులను కలిసిన వారి వివరాలు సేకరిస్తున్నారు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ). ఇప్పటికే కరోనా లక్షణాలు కనిపించిన మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు నిర్విహించి గృహ నిర్బంధానికి పంపించారు అధికారులు. అయితే, వారి పరీక్షా ఫలితాలు రావాల్సి ఉంది.