కరోనా వైరస్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. వైరస్ అనుమానితులు పెరుగుతుండటం ఒకింత ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర కొల్లాపుర్‌లో నేడు ఓ కరోనా అనుమానిత వ్యక్తి మృతి చెందాడు. ఇప్పటికే వైరస్ కారణంగా భారత్‌లో ఇద్దరు బలయ్యారు. ఇప్పటివరకు దేశంలో 110 కరోనా కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలో మరో కరోనా అనుమానితుడి మృతి - కరోనా వైరస్
దేశవ్యాప్తంగా కరోనా అనుమానితులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మహారాష్ట్రలోని కొల్లాపుర్‌లో ఓ కరోనా అనుమానితుడు ప్రాణాలు కోల్పోయాడు. ఇరాన్లో ఉన్న భారతీయుల్లో 53 మందిని ప్రత్యేక విమానంలో స్వదేశానికి తీసుకొచ్చారు అధికారులు. ఇప్పటివరకు ఇరాన్ నుంచి 389 మందిని భారత్‌కు తరలించినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు.
మహారాష్ట్రలో కరోనా అనుమానితుడి మృతి
మరో 53మంది..
ఇరాన్‌లోని భారతీయుల్లో మరో 53 మందిని స్వదేశానికి ప్రత్యేక విమానంలో తీసుకొచ్చారు అధికారులు . వీరిలో ఒక ఉపాధ్యాయుడు, 52మంది విద్యార్థులు ఉన్నట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ తెలిపారు. ఇరాన్ నుంచి భారత్ తీసుకొచ్చిన వారి సంఖ్య 389కి చేరిందని పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో ఎంతగానో సాయమందించిన ఇరాన్ అధికారులకు, భారత రాయబార కార్యాలయానికి కృతజ్ఞతలు తెలిపారు.