తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు - దేశంలో కరోనా కేసుల వివరాలు

52,509 fresh infections push India's COVID-19 tally to 19,08,254
దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

By

Published : Aug 5, 2020, 9:54 AM IST

Updated : Aug 5, 2020, 10:53 AM IST

09:51 August 05

దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా కేసుల వివరాలు

భారత్​లో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. మంగళవారం ఒక్క రోజే 52 వేల 509 కేసులు నమోదయ్యాయి. మొత్తం బాధితుల సంఖ్య 19 లక్షల 8 వేల 254కు చేరింది. ఇందులో 5 లక్షల 86 వేల 244 కేసులు యాక్టివ్​గా ఉండగా... 12 లక్షల 82 వేల 215 మంది కోలుకున్నారు.

కొత్తగా 857 మంది మరణించగా... మొత్తం మృతుల సంఖ్య 39 వేల 795కు చేరింది.

పెరుగుతున్న రికవరీ రేటు..

కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం దేశంలో 67.19 శాతం రికవరీ రేటు ఉంది. మరణాల రేటు 2.09 శాతంగా నమోదైంది. 

Last Updated : Aug 5, 2020, 10:53 AM IST

ABOUT THE AUTHOR

...view details