కరోనా దృష్ట్యా 'పోస్టల్ బ్యాలెట్' పద్దతిని ఎన్నికల సంఘం సులభతరం చేసింది. ఫలితంగా వృద్ధులు, దివ్యాంగులు ఈ పద్ధతిలో ఓటు వేసేందుకు మొగ్గు చూపుతున్నారు. బిహార్‌లో అక్టోబరు 28న జరగనున్న మొదటిదశ ఎన్నికల్లో దాదాపు 52వేల ఓటర్లు బ్యాలెట్ పద్ధతి ద్వారా ఓటు వేసేందుకు సిద్ధమయ్యారని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
బిహార్‌లో మొదటిదశ ఎన్నికలు జరగనున్న 71 నియోజకవర్గాల్లో నాలుగు లక్షలకు పైగా ఉన్న దివ్యాంగులు, వృద్ధుల్లో 52వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసేందుకు సుముఖంగా ఉన్నారు.
-- ఎన్నికల సంఘం
బ్యాలెట్ పద్ధతిలో ఓటు ఎలా?
పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో ఓటు వేయాలనుకునేవారు మొదటగా ఓ ఫామ్ నింపాలి. బూత్ అధికారి స్వయంగా ఓటర్ల ఇంటికి వెళ్లి సంబంధిత పత్రాలు అందజేస్తారు. పూర్తి భద్రత, పారదర్శకత, గోప్యత తో ఓటును వినియోగించుకోవచ్చు. ఓటు వేసేటప్పుడు పారదర్శకత కోసం వీడియో తీయనున్నారు అధికారులు.
రెండు, మూడు దశల్లోనూ..
కొవిడ్ మహమ్మారి దృష్ట్యా నవంబరు 3, 7 తేదీల్లో జరగనున్న ఎన్నికల్లోనూ పూర్తి భద్రతతోపాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనుంది ఈసీ. ఈ రెండు దశల్లో జరగనున్న ఎన్నికల్లో దాదాపు 12లక్షలమంది పోస్టల్ బ్యాలెట్‌కు మొగ్గుచూపే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇదీ చదవండి :కాంగ్రెస్‌కు ఖుష్బూ గుడ్‌బై- భాజపాకు జై