దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేస్తాం. ఈ పాలిథిన్.. మూగ జీవాల పాలిట మృత్యువుగా మారుతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను ఆహారంగా స్వీకరించటం ద్వారా చాలా జంతువులు అనారోగ్యం పాలవుతున్నాయి. తాజాగా తమిళనాడులో ఓ ఆవు జీర్ణాశయం నుంచి 52 కిలోల ప్లాస్టిక్‌ను బయటకు తీశారు పశువైద్యులు.
ఆవు కడుపులో 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు - ఆవు కడుపులో ప్లాస్టిక్
తమిళనాడులో ఓ ఆవు కడుపు నుంచి 52 కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీశారు వైద్యులు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆవును పరీక్షించిన అన్నామలై విశ్వవిద్యాలయం వైద్యులు.. సుమారు 6 గంటలపాటు శ్రమించి శస్త్ర చికిత్స చేశారు.
తమిళనాడు చెన్నైలో అనారోగ్యంతో బాధపడుతున్న ఆవును పరీక్షించిన అన్నామలై విశ్వవిద్యాలయం వైద్యులు.. దాని కడుపులో భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు గుర్తించారు. ఐదున్నర గంటల పాటు శ్రమించి 52 కేజీల పాలిథిన్ను తొలగించారు. ప్లాస్టిక్‌తో పాటు రెండు ఇనుప వస్తువులు, ఓ నాణెన్ని కూడా బయటకు తీశారు. ఆవు కడుపులోని రూమెన్ (జీర్ణశయంలోని నాలుగు గదుల్లోని ఒక భాగం)లో 75 శాతం ప్లాస్టిక్‌తో నిండిపోయిందని వైద్యులు తెలిపారు.
ఇదీ చూడండి:హరియాణా దంగల్: 'ఫిర్ ఏక్ బార్ భాజపా సర్కార్'!