2020 తొలి 4 నెలల్లోనే జమ్ము కశ్మీర్లో సైనిక బలగాలు చేపట్టిన ఆపరేషన్స్‌లో ఇప్పటివరకు 50 మంది ముష్కరులు హతమైనట్లు వెల్లడించారు అధికారులు. కేవలం కరోనా లాక్డౌన్ కాలంలోనే 18 మందిని ఎన్కౌంటర్ చేసినట్లు తెలిపారు. వారిలో జైషే మహమ్మద్(జేఈఎం), లష్కరే తోయిబా(ఎల్‌ఈటీ) ఉగ్ర సంస్థలకు చెందిన నాయకులూ ఉన్నట్లు వెల్లడించారు.
దేశం కోసం 17మంది..
ఉగ్రవాదులతో పోరాడుతూ 17మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని అధికారులు తెలిపారు. గత నాలుగు నెలల్లో 9 మంది దేశ పౌరులను ముష్కరులు పొట్టన పెట్టుకున్నారని వెల్లడించారు.
ఎప్పుడు.. ఎక్కడ.. ఎలా..
- ఏప్రిల్ 9న ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లో జైషే మహమ్మద్ కమాండర్ సాజాద్ నవాబ్ దార్‌ను సైనిక బలగాలు మట్టుబెట్టాయి.
- మార్చి 15న కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా డయాల్‌గమ్ ప్రాంతంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముజాఫర్ అహ్మద్ భట్ సహా నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. వారు ఎల్‌ఈటీ, హిజ్బుల్ ముజాహిదీన్ ఉద్రసంస్థలకు చెందినవారు.
- జనవరి 25న పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో సైనిక బలగాలకు ఉగ్రవాదులకు జరిగిన పోరాటంలో జైషే మహమ్మద్ చీఫ్ క్వారీ యస్సార్తో పాటు మరో ముగ్గురు ముష్కరులు మృతి చెందారు. ఈ పోరులో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
- జనవరి 23న పుల్వామా జిల్లా ఖేరా ప్రాంతంలో యస్సార్ ఉగ్ర సంస్థతో సంబంధం ఉన్న అబు షైఫుల్హా అలీయాస్ అబు క్వాసిమ్ను ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు.
- జనవరి 15న జమ్మూకశ్మీర్ దోడాలోని గుండానా ప్రాంతంలో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హరూన్ వాని మృతి చెందాడు.
- మార్చి 14 తర్వాత లాక్డౌన్ కాలంలో 18 మంది ముష్కరులను ఎన్కౌంటర్ చేశారు.
2019లో కశ్మీర్లో 160మంది ఉగ్రవాదులను మట్టుబెట్టి.. 102మంది అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఇదీ చూడండి:భారత్‌లో కరోనా 2.0 ఖాయం- వచ్చేది అప్పుడే!