భారీ వరదలు అసోంను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఉన్న ప్రఖ్యాత కాజీరంగా జాతీయ పార్కు సగానికిపైగా వరద నీటిలో మునిగింది. వరదలను తప్పించుకునేందు పార్కు నుంచి బయటికి వచ్చి కొన్ని వన్య జీవాలు మృతి చెందగా.. మరికొన్ని వరదల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయాయి.
మూగ జీవాలను రక్షించేందుకు అధికారులు ఎత్తయిన ప్రాంతాలకు తరలించారు. అయితే వాటికి ఆహారం పెద్ద సమస్యగా మారింది. కొన్ని వన్య మృగాలు ఆహారం కోసం జనావాసాల్లోకి వస్తున్నాయి. ఆహార కొరత, మురుగు నీరు కారణంగా అటవీ మృగాలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నాయి.