గత ఏడాది కాలంలో తమ జీవన ప్రమాణాలు దిగజారిపోయాయని 50శాతానికిపైగా ప్రజలు భావిస్తున్నట్టు ఓ సర్వేలో తేలింది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం ఈ సర్వేను నిర్వహించింది దేశంలోని ఓ మీడియా సంస్థ.
జనాభాలోని అన్ని వర్గాల వారినీ కలుపుకొని 1,200మందిపై ఈ సర్వే నిర్వహించారు. గతేడాది కాలంలో తమ జీవన ప్రమాణాలు క్షీణించాయని 50.7శాతం మంది పేర్కొన్నారు. 2020 బడ్జెట్ సమయంలో అది 31.3శాతంగా ఉండటం గమనార్హం.
జీవన ప్రమాణాలు క్షీణిస్తున్నాయని.. 2019 బడ్జెట్ సమయంలో 26శాతం మంది చెప్పగా.. 2015, 2016, 2017, 2018 పద్దు సమయాల్లో అవి 38.1శాతం, 39.5శాతం, 32.9శాతం, 33.4శాతంగా ఉన్నాయి.