కరోనా మహమ్మారితో అన్ని రంగాలు కుదేలయ్యాయి. వలస కూలీలు పని లేక స్వరాష్ట్రాలకు వెళ్లారు. ప్రస్తుతం వారికి ఉపాధి హామీ పనే పెద్ద ఆసరాగా నిలుస్తోంది. ఛత్తీస్గఢ్లో ఈ ఆర్థిక ఏడాది తొలి నాలుగు నెలల కాలంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎంఎన్ఆర్ఈజీఏ) కింద 50.75 శాతం మంది మహిళలు ఉపాధి పొందారు. గడిచిన నాలుగేళ్లలో మహిళలకు ఎంఎన్ఆర్ఈజీఏ కింద ఇంత భారీ స్థాయి పని దినాలు కల్పించడం ఇదే తొలిసారి. తొలి నాలుగు నెలల్లో ఈ పథకం కింద 24,28,234 మంది మహిళలకు ఉపాధి లభించింది. వచ్చే నాలుగు నెలల్లో ఈ సంఖ్య మరింత పెరగనుందని అధికారులు అంచనావేస్తున్నారు.
ఈ పథకం కింద రాష్ట్రంలో మొత్తం 9,17,87000 పని దినాలు కల్పించగా.. అందులో స్త్రీలకు ప్రత్యేకంగా 4,65,85000 రోజులు కేటాయించారు.
సగానికి పైగా స్త్రీలే..
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది ఎంఎన్ఆర్ఈజీఏ కింద.. మొత్తం 48,14,330 మంది కూలీలకు ఉపాధి కల్పించింది ప్రభుత్వం. వీరిలో సగానికి పైగా 50.75 శాతం(24,28,234)మంది మహిళా కార్మికులే ఉండటం గమనార్హం.