ఆగస్టు-అక్టోబర్ మధ్య పాకిస్థాన్ సైన్యం 950 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని కేంద్రం వెల్లడించింది. పొరుగు దేశ సైన్యం దాడిలో ముగ్గురు భారతీయ జవాన్లు అమరులైనట్లు తెలిపింది. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెల్లడించారు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్.
"పాక్ నియంత్రణరేఖ వద్ద 950సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ము ప్రాంతంలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద 75 సార్లు కాల్పులు జరిపింది. ఈ మూడు నెలల్లో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. మరో ఏడుగురు గాయపడ్డారు. పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినప్పుడల్లా భారత సైన్యం దీటుగా సమాధానం ఇస్తూనే వస్తుంది. ఈ అంశాన్ని పలుసార్లు పాక్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం."