దేశంలో రోజూ ఏదోమూల అత్యాచార ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా.. ఉత్తర్‌ప్రదేశ్ పిలిబిత్ జిల్లాలో మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ దుండగుడు. ఈ విషయాన్ని బాలిక తండ్రి.. ఈటీవీ భారత్‌తో వెల్లడించారు.
ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదేళ్ల బాలికపై అత్యాచారం - Pilibhit rape case news
ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో అత్యాచార ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదేళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.
ఐదేళ్ల బాలికపై అత్యాచారం- నిందితుడు కోసం గాలింపు
టాయిలెట్‌కు వెళ్లిన ఐదేళ్ల చిన్నారిని చెరకు తోటలోకి తీసికెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ కిరాతకుడు. బాధితురాలు.. ప్రస్తుతం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:కరోనాకు ఒకే కుటుంబంలో ఒక తరం బలి