తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కాంగ్రెస్ లోక్​సభా పక్షనేతగా అధీర్ చౌదరి - కాంగ్రెస్ చీఫ్​ విప్

లోక్​సభలో కాంగ్రెస్ పక్షనేతగా ఆ పార్టీ సీనియర్ నేత, బంగాల్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి నియామకమయ్యారు. చీఫ్ విప్​గా కేరళ ఎంపీ కె. సురేశ్ నియమితులయ్యారు.

కాంగ్రెస్ లోక్​సభ పక్షనేతగా అధిర్ చౌదరి

By

Published : Jun 19, 2019, 7:17 AM IST

Updated : Jun 19, 2019, 12:24 PM IST

కాంగ్రెస్ లోక్​సభా పక్షనేతగా అధిర్ చౌదరి

కాంగ్రెస్ లోక్​సభ పక్షనేత ఎవరన్న చర్చకు తెరపడింది. దిగువసభలో కాంగ్రెస్ పక్షనేతగా సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి నియమితులయ్యారు. బంగాల్​ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న అధీర్ అయిదో సారి ఎంపీగా గెలిచారు.

ఆయన నియామక పత్రాన్ని లోక్​సభ సచివాలయంలో సమర్పించారు చౌదరి. బంగాల్​లోని ముర్షిదాబాద్ జిల్లా బహరాంపూర్​ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

"పార్టీ నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. నాపై పెద్ద బాధ్యతలు ఉంచారు. నా విధులను సక్రమంగా నిర్వర్తించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా. పౌర హక్కుల కోసం పోరాడిన కిందిస్థాయి కార్యకర్తను నేను. సాధారణ ప్రజానీకానికి సంబంధించిన అంశాలపై పార్లమెంటు వేదికగా పోరాటాన్ని కొనసాగిస్తా."

-అధీర్ చౌదరి, కాంగ్రెస్ లోక్​సభా పక్షనేత

1999 ఎన్నికల నుంచి ఇప్పటివరకూ 5 సార్లు లోక్​సభకు అధీర్ ఎన్నికయ్యారు. 1996 నుంచి 1999 వరకు బంగాల్ శాసనసభ సభ్యుడిగా ఉన్నారు. 2012 - 2014 మధ్య యూపీఏ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.

చీఫ్ విప్​గా సురేశ్

కాంగ్రెస్ చీఫ్​ విప్​గా నియామకమైన కె. సురేశ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేత. కేరళలోని మెవెళిక్కర నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. చీఫ్ విప్​గా అవకాశం ఇవ్వడం పట్ల పార్టీ అధిష్ఠానానికి సురేశ్ కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చూడండి: 17వ లోక్​సభ స్పీకర్​గా ఓం బిర్లా!

Last Updated : Jun 19, 2019, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details