కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలపై విపక్ష పార్టీలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలవనున్నాయి. చట్టాలను రద్దు చేయాలని రాష్ట్రపతిని కోరనున్నట్లు తెలిపాయి.
ఐదుగురు నేతలు సాయంత్రం 5 గంటలకు రాష్ట్రపతిని కలుస్తారని సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, డీఎంకే ప్రతినిధి, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా విపక్ష పార్టీల తరపున హాజరుకానున్నట్లు వెల్లడించాయి.